![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -339 లో.. ముకుంద, మురారి పూజ చేస్తుంటారు. మీ వయసు గల వారు కంకనం కట్టాలని పంతులు అనగానే కృష్ణ ఉంది కదా అని మురారి అంటాడు. అవసరం లేదు నందుని తీసుకుని రమ్మని ప్రసాద్ కి భవాని చెప్తుంది. కాసేపటికి కృష్ణ, నందుల దగ్గరికి ప్రసాద్ వెళ్తాడు. అక్కడే మధు కూడా ఉంటాడు. జరిగింది చెప్పి కృష్ణ నువ్వు పద అని అనగానే మధు హ్యాపీగా ఫీల్ అవుతాడు.
ఆ తర్వాత కృష్ణని తీసుకోని ప్రసాద్ పూజ దగ్గరికి వెళ్తాడు. కృష్ణని చూసి అందరు షాక్ అవుతారు. నందుకి తలనొప్పి గా ఉంటే కృష్ణని తీసుకోని వచ్చానని ప్రసాద్ చెప్తాడు . కాసేపటికి కృష్ణ వెళ్లి మురారికి కంకనం కడుతుంటే మురారికి గతం గుర్తుకు వచ్చినట్లు అవుతుంది. ఆ తర్వాత ముకుందకి కడుతుంది. కాసేపటికి నందు దగ్గరికి వెళ్లి మురారికి గతం గుర్తుకు వస్తున్నట్టు ఉందని కృష్ణ హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరొక వైపు ముకుంద కోనేరు దగ్గరికి దీపాలు వదలడానికి వెళ్తుంది. తనతో పాటు కృష్ణ కూడా వెళ్తుంది. అసలు ఎందుకు నాకు ప్రశాంతత లేకుండా చేస్తున్నావని కృష్ణతో ముకుంస అంటుంది. అప్పుడే కృష్ణ కోనేరులో పడిపోతుంది. కాపాడండి ఏసీపీ సర్ అని కృష్ణ గట్టిగా అరుస్తుంటుంది. దాంతో మురారి పరుగున వచ్చి కృష్ణని కాపాడతాడు. ఆ తర్వాత కృష్ణ సర్ అంటూ ఏదో చెప్పబోతుండగా.. నీ ఏసీపీ సర్ ని. నాకు గతం గుర్తుకువచ్చిందని మురారి చెప్పగానే.. ఒక్క ముకుంద తప్ప అక్కడున్న అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. గతం మర్చిపోయి మిమ్మల్ని ఇబ్బంది పెట్టానని భవానితో మురారి అంటాడు.
ఆ తర్వాత అందరు కలిసి ఇంటికి వస్తారు. ముకుంద కోపంగా లోపలికి వెళ్తుంది. కృష్ణ ఈ రాత్రి నువ్వు అవుట్ హౌస్ లోకి వెళ్ళు.. రేపు ప్రొద్దున మాట్లాడుతానని భవాని చెప్తుంది. మధు లోపలికి వెళ్లి చూసేసరికి ముకుంద సూసైడ్ చేసుకొని ఉంటుంది. కృష్ణ తనకి ట్రీట్ మెంట్ ఇస్తుంది. తరువాయి భాగంలో ముకుంద, నువ్వు ప్రేమించుకున్నది నిజం కాద? నీ మీద ప్రేమతో ఆ పిచ్చిది ప్రాణం మీదకి తెచ్చుకుంది. అందుకే వచ్చే శుక్రవారం ముకుందకి నీకు పెళ్లి అని భవాని చెప్తుంది.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |